ఉద్యోగుల మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరం: ఇన్‌చార్జ్ జీఎం ఏవీ రెడ్డి

శ్రీరాంపూర్ వేదికగా సింగరేణి కంపెనీ స్థాయి బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం

నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు అత్యంత ముఖ్యమని, క్రీడాకారుల ప్రోత్సాహానికి సింగరేణి సంస్థ నిధుల ఖర్చుకు వెనుకాడడం లేదు” అని శ్రీరాంపూర్ ఇన్‌చార్జ్ జనరల్ మేనేజర్ ఏవీ రెడ్డి అన్నారు. సింగరేణి సంస్థ కంపెనీ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలు శ్రీరాంపూర్ ఏరియా వేదికగా మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలోని సీఈఆర్ క్లబ్‌లో షటిల్ బ్యాడ్మింటన్ (పురుషులు, మహిళలు), నస్పూర్‌లోని మనోరంజన్ సముదాయ్‌లో టేబుల్ టెన్నిస్ (పురుషులు, మహిళలు), సీసీసీలోని ఎస్సీఈఓ క్లబ్‌లో వెటరన్ బ్యాడ్మింటన్ (పురుషులు, మహిళలు) పోటీలను ఇన్‌చార్జ్ జీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీ స్థాయి పోటీలకు శ్రీరాంపూర్ ఏరియా ఆతిథ్యమివ్వడం గర్వకారణమన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించి, ఇక్కడ ప్రతిభ చాటిన వారు కోల్ ఇండియా స్థాయిలోనూ ఉత్తమ విజయాలు సాధించి సింగరేణి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, గుర్తింపు సంఘం ప్రతినిధి మురళీ చౌదరి, సింగరేణి స్పోర్ట్స్ మేనేజర్ సునీల్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ శ్రీరాంపూర్ ఏరియా గౌరవ కార్యదర్శి పాల్ సృజన్, స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ సురేష్, వివిధ ఏరియాల నుంచి వచ్చిన క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment