మంచిర్యాల జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు గడ్డం సుధాకర్
నస్పూర్లో పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యత్వ నమోదు, గుర్తింపు కార్డుల పంపిణీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: కుల బాంధవుల ఐక్యత, సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం ఎంతో అవసరం అని మంచిర్యాల జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు గడ్డం సుధాకర్ పేర్కొన్నారు. నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సంఘ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సభ్యత్వం తీసుకున్న పద్మశాలీలకు అధికారిక గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గడ్డం సుధాకర్ మాట్లాడుతూ.. ఈ గుర్తింపు కార్డులు పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు పద్మశాలి సత్రాలలో వసతి పొందడానికి, సంఘ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి, అలాగే కులపరమైన గుర్తింపు, ఇతర అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. నస్పూర్ పట్టణంలోని పద్మశాలీలందరూ విధిగా సభ్యత్వం తీసుకోవాలని కోరారు. సభ్యత్వ రుసుముగా రూ.300 నిర్ణయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షుడు చిలగాని బొడ్డయ్య, ప్రధాన కార్యదర్శి కుందారపు రమేష్, కోశాధికారి చిప్ప రాజబాబు, ఆలయ ప్రధాన కార్యదర్శి తౌటం మల్లేష్, కోశాధికారి సబ్బని భాస్కర్, కమిటీ సభ్యులు కొండ శ్రీనివాస్, ఆడేటి రాజయ్య, కుంట రామయ్య, కన్నం సాంబయ్య, గుండు యాదగిరి, అన్నం వెంకటేశ్వర్లు, పాటేటి శంకరయ్య, కుందారపు రాములు, క్యాతం రాజేష్, రమేష్, సర్వేశం తదితరులు పాల్గొన్నారు.







