రాజకీయ పార్టీల ఫ్లెక్సీల ధ్వంసం కేసులో నిందితుడి అరెస్ట్

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్సై ఎండీ. తహసీనుద్దీన్
సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న సీసీసీ నస్పూర్ పోలీసులు..

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని గాంధీనగర్‌లో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను చించిన కేసులో నిందితుడిని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేగంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని సీసీసీ నస్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎండీ. తహసీనుద్దీన్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత నస్పూర్‌లోని గాంధీనగర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం పక్కన ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేసినట్లు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధునిక సాంకేతిక ఆధారాలను విశ్లేషించి శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు గాంధీనగర్‌కు చెందిన కుంచం రాముగా గుర్తించారు. మద్యం మత్తులో తానే ఆ ఫ్లెక్సీలను చించినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అతనిపై చట్టపరమైన కేసు నమోదు చేసి చర్యలు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.

వదంతులు నమ్మవద్దు.. తప్పుడు పోస్టులు పెడితే అడ్మిన్లపై చర్యలు:

ఈ సందర్భంగా ఎస్సై ఎండీ. తహసీనుద్దీన్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఫ్లెక్సీల ఘటనపై తొందరపడి ఎలాంటి తప్పుడు ప్రచారాలను, వదంతులను నమ్మవద్దని సూచించారు. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో, గ్రూపుల్లో తప్పుడు పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తప్పుడు ఫోటోలు, వీడియోలను సృష్టించి పోస్ట్ చేయకూడదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే పోస్ట్ చేసిన వ్యక్తులతో పాటు సంబంధిత గ్రూప్ అడ్మిన్లపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment