అక్టోబర్‌లో శ్రీరాంపూర్ ఏరియా 94 శాతం బొగ్గు ఉత్పత్తి సాధన

  • ఐదు భూగర్భ గనులు, ఎస్సార్పీ ఓసీలో 100 శాతం ప్రగతి
  • వార్షిక లక్ష్యాన్ని చేరుకుంటాం: జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, ఆర్.కె న్యూస్: అక్టోబర్ మాసంలో శ్రీరాంపూర్ ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకతలో అత్యుత్తమ ఫలితాలు నమోదు చేసిందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. శనివారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏరియాలోని ఐదు భూగర్భ గనులతో పాటు ఎస్సార్పీ ఓపెన్‌కాస్ట్ గని వంద శాతానికి పైగా ఉత్పత్తి సాధించాయని, ఓవరాల్‌గా ఏరియా వ్యాప్తంగా 94 శాతం ఉత్పత్తి నమోదైందని పేర్కొన్నారు. రాబోయే ఐదు నెలల్లో సమష్టి కృషితో వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని నూరు శాతం అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలలో ఏరియా మొత్తం లక్ష్యం 5,35,000 టన్నులకు గాను 5,04,431 టన్నుల (94 శాతం) బొగ్గును ఉత్పత్తి చేశామన్నారు. భూగర్భ గనుల విభాగంలో ఎస్సార్పీ 3,3ఏ గని 117 శాతం, ఆర్.కె-ఎన్‌టీ 111 శాతం, ఆర్.కె-5 గని 102 శాతం, ఆర్.కె-7 గని 101 శాతం, ఎస్సార్పీ-1 గని 100 శాతం సాధించగా.. ఐకే-1ఏ గని 94 శాతం నమోదు చేసింది. మొత్తంగా భూగర్భ గనులు 1,15,000 టన్నుల టార్గెట్‌కు గాను 1,20,647 టన్నుల బొగ్గును వెలికితీసి 105 శాతం ప్రగతిని సాధించాయి. ఇక ఉపరితల గనుల్లో ఎస్సార్పీ ఓసీపీ 101 శాతం నమోదు చేయగా, ఐకే ఓసీ 67 శాతానికి పరిమితమైందన్నారు. నవంబర్‌లో ఐకే ఓసీలోనూ 100 శాతం ఉత్పత్తి సాధిస్తామన్నారు. ఇదే క్రమంలో ఏరియాలో ఇప్పటివరకు మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా 3,868 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించామని, 322 మందికి ఎల్‌ఎస్‌పీ, 14 మందికి ఎంఎంసీ చెల్లించామని జీఎం వెల్లడించారు. అలాగే 9,801 మంది రిటైర్డ్ కార్మికులకు సీపీఎంఆర్‌ఎస్ స్మార్ట్ మెడికల్ కార్డులు అందజేశామని చెబుతూ.. ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డీజీఎం (ఐఈడీ) రాజన్న, డీవై పీఎం క్రాంతి కుమార్ పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment