ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నిండాలి

స్వగృహంలో కుటుంబ సమేతంగా దీపావళి వేడుకలు జరుపుకున్న మేయర్ ధర్ని మధుకర్
కార్పొరేషన్ ప్రజలు, సిబ్బందికి శుభాకాంక్షలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: దీపాల పండుగ దీపావళి ప్రజలందరి జీవితాల్లో చీకట్లను పారద్రోలి సరికొత్త వెలుగులు నింపాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నస్పూర్‌లోని తన స్వగృహంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీదేవికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల ప్రజలు, మహిళలు, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా తమ కుటుంబాలతో కలిసి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. పండుగను పర్యావరణహితంగా, ప్రమాద రహితంగా జరుపుకోవాలని సూచించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment