సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ గ్రామానికి చెందిన రైతుల మొక్కజొన్న సంచులను దొంగిలించిన ఐదురుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ గోవర్ధన్ రెడ్డి ఆదివారం ప్రెస్ మీట్ లో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు, సీఐ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎస్సై గోపి దొంగలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. లోకల్ వెల్మల్ గ్రామానికి చెందిన రైతుల యొక్క మొక్కజొన్న సంచులను ఈనెల 7వ తేదీన దొంగిలించడం జరిగిందని, అట్టి వాహనం లొకేషన్ ఆధారంగా ఆదివారం ఉదయం మాదాపూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మొక్కజొన్న సంచులను దొంగిలించిన ఐదుగురు వ్యక్తులు కామారెడ్డిలో అమ్మడానికి వెళుతుండగా, అట్టి వాహనాన్ని తనిఖీ చేయడంతో ఆ అయిదుగురు వ్యక్తులు దొరికారని సిఐ తెలిపారు. వారిని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. అట్టి కేసును చేదించిన ఎస్సై గోపిని, సిబ్బందిని ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. అలాగే రైతులు పండించిన పంటలను రోడ్డుపై ఆరబెట్టినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దేవన్న, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
10







