ఎస్ఆర్‌‌పీ-1 గని కార్మికులకు మూడేళ్లుగా నిలిపివేసిన కేటగిరీ ప్రమోషన్లు కల్పించాలి: ఏఐటీయూసీ నాయకులు

⚪ గని ఆవరణలో ఏఐటీయూసీ ధర్నా.. మేనేజర్‌కు వినతిపత్రం అందజేత

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అనే నినాదంతో యాజమాన్యం ముందుకు సాగుతున్నప్పటికీ, శ్రీరాంపూర్ ఏరియాలోని ఇతర గనులకు కేటగిరీ ప్రమోషన్లు కల్పిస్తూ ఎస్ఆర్‌‌పీ-1 గని కార్మికులపై మాత్రం గత మూడేళ్లుగా వివక్ష చూపడం సరికాదని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్‌కే బాజీ సైదా మండిపడ్డారు. ఎస్ఆర్‌‌పీ-1 గనిలో గత మూడు సంవత్సరాలుగా నిలిపివేసిన కేటగిరీ ప్రమోషన్లను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గనిపై ధర్నా నిర్వహించారు. అనంతరం గని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సింగరేణిలోనే అత్యంత క్లిష్టమైన అధిక గ్రేడియంట్ కలిగిన ఎస్ఆర్‌‌పీ-1 గని కార్మికులు యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను 100 శాతం సాధిస్తూ ప్రతి ఏటా ఉత్పత్తి, ఉత్పాదకతలో ముందంజలో ఉంటున్నారని కొనియాడారు. గత సెప్టెంబర్‌లోనే 50 వసంతాలు పూర్తి చేసుకుని శ్రీరాంపూర్ భూగర్భ గనులకే ఆదర్శంగా నిలిచిన ఈ గని కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గనిలో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కోల్ కట్టర్, సపోర్ట్‌మెన్, లైన్‌మెన్, ట్రామర్, సర్వే అసిస్టెంట్, అసిస్టెంట్ చైన్‌మెన్, చైన్‌మెన్ ఖాళీలను తక్షణమే గుర్తించి, డివిజన్‌లోని ఇతర గనుల తరహాలోనే ఇక్కడి కార్మికులకు కూడా కేటగిరీ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, పిట్ కార్యదర్శి దాడి రాజయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, ఉపాధ్యక్షులు అనంతరెడ్డి, సహాయ కార్యదర్శులు పరశురాం, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment