కేరళ మోడల్ హైస్కూల్‌లో విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన పోటీలు

​నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కృష్ణ కాలనీలోని కేరళ మోడల్ హైస్కూల్‌లో శనివారం భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక పోటీలు నిర్వహించారు. ​ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగ అంశాలపై ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ప్రాథమిక హక్కులు–విధులు, బాధ్యతలపై చార్ట్ ప్రిపరేషన్, భారత రాజ్యాంగం ముందు – తర్వాత’ అనే అంశంపై ఉపన్యాస పోటీలను ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ​ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఈ నెల 26వ తేదీన జరగనున్న భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో బహుమతులను ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ప్రతినిధులు యుగంధర్, సాయి, సునీల్, నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జార్జ్, సమ్మయ్య, బిషన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment