నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జన్మదినం సందర్భంగా శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేయర్ దర్ని మధుకర్ – సుజాత దంపతుల ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ… మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కొక్కిరాల సురేఖకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవకు అంకితమైన సురేఖ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాచకొండ గోపాల్ రావు, ఎండీ ఖలీద్, కొండ్ర రాజేశ్వరి – లింగయ్య, డివిజన్ అధ్యక్షుడు గోపతి తిరుపతి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పిట్టల రవి, నాయకులు రెంక రవి, స్థానిక ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
9







