అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ

423 మందికి ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లకు శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంగళవారం మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 423 మంది టీచర్లకు ఈ ఫోన్లను అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను డిజిటలైజ్ చేయడానికి, విధి నిర్వహణలో వేగం పెంచడానికి ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంది. క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఈ మొబైల్ ఫోన్లు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment