శ్రీరాంపూర్‌లో డ్రైవర్ల విశ్రాంతి గది ప్రారంభం

జీఎం కార్యాలయం ప్రాంగణంలో రిబ్బన్ కట్ చేసిన జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ప్రాంగణంలో శనివారం డ్రైవర్ల విశ్రాంతి గదిని జీఎం మునిగంటి శ్రీనివాస్ ప్రారంభించారు. వివిధ విభాగాధిపతుల వాహనాలు నడుపుతున్న కాంట్రాక్టు డ్రైవర్ల కోసం జీఎం కార్యాలయంలో నూతనంగా ఈ గదిని నిర్మించారు. ఖాళీ సమయాల్లో డ్రైవర్లు సేదదీరేందుకు ఈ సదుపాయం కల్పించారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల అనంతరం ఎస్ఓటు జీఎం ఎన్. సత్యనారాయణతో కలిసి జీఎం రిబ్బన్ కట్ చేసి ఈ గదిని అందుబాటులోకి తెచ్చారు. గది లోపల వసతులను స్వయంగా పరిశీలించిన జీఎం డ్రైవర్ల సౌకర్యార్థం కావలసిన అన్ని రకాల వసతులను అందులో కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నో రోజుల తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విశ్రాంతి గదిని ఏర్పాటు చేసినందుకు హైర్ వెహికల్స్ కాంట్రాక్ట్ డ్రైవర్లు జీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, ఏజీఎం ఫైనాన్స్ సుమలత, డీజీఎం పర్సనల్ ఎస్. అనిల్ కుమార్, డీజీఎం ఐఈడీ రాజన్న, డీజీఎం ఫారెస్ట్ హరినారాయణ, డీజీఎం సేఫ్టీ విజయ్ కుమార్, డీజీఎం సివిల్ ఆనంద్ కుమార్, పర్చేజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment