సోన్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా సోన్ ఐబీ నుండి గాంధీనగర్ కు వెళ్లే తారు రోడ్డుపై 11 కెవి ఎల్ టి వైర్లు తొలగించాలని రైతులు శనివారం విద్యుత్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. 11 కె.వి విద్యుత్ వైర్లు కిందికి ఉండటం వలన భారీ వాహనాలు వెళ్ళటానికి ఇబ్బందిగా ఉన్నదని పాక్ పట్ల, మాదాపూర్,రైతులు తాము పండించిన పంటలను మార్కెట్ కు తీసుకెళ్లేటప్పుడు లారీలకు ఇబ్బందిగా ఉండటం వలన సోన్ సబ్ స్టేషన్ లో ఏ ఈ కి గ్రామస్తులు వినతి పత్రం ఇవ్వటానికి వెళ్లగా అక్కడ స్థానికంగా ఉన్న సబ్ ఇంజనీర్ విష్ణు వినతిపత్రాన్ని తీసుకోవడం జరిగినదని అలాగే ఏ ఈ తో మాట్లాడగా వారం రోజులలో సమస్య పరిష్కరిస్తానని ఫోన్లో చెప్పడం జరిగినదని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార గంగారెడ్డి, తోట వెంకట్, నక్కల.నవీన్, చిన్నయ్య,సొండి ముత్యం, దేవేందర్,భీముడు, నక్కల ముత్యం, పెద్దోళ్ళ ముత్యం తదితరులున్నారు.
13







