సోన్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో రైతులకు వరి కొయ్యలను బహిరంగంగా కాల్చవద్దని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వినోద్ కుమార్,వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్ మాట్లాడుతూ పంట అవశేషాలను కాల్చడం వల్ల నేల సారవంతత తగ్గిపోవడం, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడం, వాయు కాలుష్యం పెరగడం వంటి అనేక నష్టాలు కలుగుతాయని వివరించారు.వరి కొయ్యలను కాల్చకుండా నేలలో కలపడం, సేంద్రీయ ఎరువుల తయారీకి వినియోగించడం, పశువుల మేతగా ఉపయోగించడం ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని సూచించారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
10







