టీయూడబ్ల్యూజే నూతన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు విలేకరుల సన్మానం

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ఇటీవల జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే – ఐజేయూ) మంచిర్యాల జిల్లా ఎన్నికల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నూతనంగా ఎన్నికైన ఆకుల రాజు, ఎ. రమేష్ రెడ్డిలను గురువారం మంచిర్యాలలో నస్పూర్, శ్రీరాంపూర్ విలేకరులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ… జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమం, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీ ముందుండి పోరాడాలని కోరారు. జర్నలిస్టులందరినీ కలుపుకుని ఐక్యతను మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు భూపతి రవి, కొండ శ్రీనివాస్, ఏల్పుల మల్లేష్, శ్రీపతి రాములు గౌడ్, క్యాతం రాజేష్, పాదం నర్సయ్య, రాళ్లబండి రాజన్న, జనార్దన్, నరేందర్, సింగని వీరాస్వామి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment