సిసిసి కార్నర్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను శుక్రవారం నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్ వద్ద ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నస్పూర్ పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ శ్రేణులు భారీగా పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి, ఐటీ రంగానికి కేటీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నస్పూర్ పట్టణ కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, 4వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు వంగ తిరుపతి, పూదరి కుమార్, నాయకులు బండి రమేష్, పోగాకు రమేష్, కుమ్మం రాజేశ్వర్ రెడ్డి, రఫీ ఖాన్, జాడి భానుచందర్, వేల్పుల రాజేష్, రుకుం తిరుమల్, ఒడ్డె వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.







