ఓవర్‌మెన్ వేధింపులపై ఎస్‌ఆర్‌పీ-3 గని కార్మికుల ఆందోళన

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్‌ఆర్‌పీ-3 భూగర్భ గనిలో జనరల్ షిఫ్ట్ ఓవర్‌మెన్ మోసిన్ వేధింపులు, బూతు పురాణం భరించలేక శుక్రవారం కార్మికులు, ఏఐటీయూసీ నేతలు నిరసనకు దిగారు. విధి నిర్వహణలో దుర్భాషలాడుతూ అవమానిస్తున్న ఓవర్‌మెన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్రమవ్వడంతో గని మేనేజర్ స్పందించి, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో కార్మికులు తాత్కాలికంగా నిరసన విరమించారు. నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోకపోతే భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, షేక్ బాజీ సైదా, మురళి చౌదరి, తౌటం మల్లేశ్, కారుకూరి నగేశ్, నరేష్, కంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment