నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ కార్పొరేటర్ ఏల్పుల రవీందర్ జాతీయ ఉత్తమ కార్పొరేటర్‌గా ఎంపికయ్యారు. డివిజన్ ప్రజలకు ఆయన అందిస్తున్న విశేష ప్రజాసేవలను గుర్తించి, బహుజన సాహితి అకాడమీ నేషనల్ కమిటీ ఆయనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున ఈ అవార్డును ప్రకటించింది. హైదరాబాద్‌లోని నాచారంలో గల బహుజన సాహితి అకాడమీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయనకు ఎంపిక పత్రాలను అందజేశారు. ఈ పురస్కారాన్ని నవంబర్ 15న న్యూఢిల్లీలోని కర్రోల్ బాగ్ లో నిర్వహించే కార్యక్రమంలో అధికారికంగా ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఏల్పుల రవీందర్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించిన 7వ డివిజన్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజలందరికీ సమానత్వంతో సేవలందించడమే తన లక్ష్యమని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనను ఉత్తమ కార్పొరేటర్‌గా ఎంపిక చేసిన బహుజన సాహితి అకాడమీ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. తన గెలుపులో, సేవా ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.








