నస్పూర్‌లో ఘనంగా మండల స్థాయి చెక్‌ముకి సైన్స్ టాలెంట్ టెస్ట్

నస్పూర్, ఆర్.కె న్యూస్: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెక్‌ముకి సైన్స్ టాలెంట్ టెస్ట్–2026 పరీక్షను శనివారం విద్యానగర్ సీసీసీలోని శ్రీ కృష్ణవేణి హైస్కూల్‌లో నిర్వహించారు. నస్పూర్ ఎంఈఓ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పరీక్షను ప్రారంభించారు. సర్ సి.వి. రామన్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, ప్రశ్నించే తత్వం పెంపొందాలని ఎంఈఓ సూచించారు. మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు 37 ఏళ్లుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడు బత్తిని దేవన్న తెలిపారు. మండలంలోని 11 పాఠశాలలు పాల్గొన్న ఈ పరీక్షలో ఆక్స్‌ఫర్డ్ క్రియేటివిటీ హైస్కూల్ ప్రథమ, మార్టిన్స్ గ్రామర్ హైస్కూల్ ద్వితీయ, సింగరేణి కాలరీస్ హైస్కూల్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. ప్రథమ స్థానం సాధించిన ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్ విద్యార్థినులు వి. సౌమ్య చంద్రిక, ఎ. సాయిశ్రీ, డి. అక్షిత వర్మ ఈ నెల 28న జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరికి నిర్వాహకులు జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment