13
సోన్, ఆర్.కె న్యూస్: యువత గంజాయి మహమ్మారికి దూరంగా ఉండాలని ఎస్సై గోపి అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఎస్పీ డా,జానకీ షర్మిల ఆదేశాల మేరకు “గంజా గస్తీ”లో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో గంజాయి-నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గోపి మాట్లాడుతూ యువకులు గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి అలవాటు వలన కలిగే నష్టాల గురించి తెలియజేయడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లల పైన దృష్టి సారించి, వారి కదలికల పైన నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి రవాణా గురించి ఎలాంటి సమాచారం అయిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సాజిత్, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ నాయక్, కానిస్టేబుల్ శ్రీనివాస్, కడ్తాల్ గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు.







