శ్రీరాంపూర్ జీఎంకు కార్పొరేటర్ పత్తి ప్రకృతి వినతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నగర పాలక సంస్థ మూడో డివిజన్ కృష్ణ కాలనీలో నెలకొన్న పౌర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ పత్తి ప్రకృతి శనివారం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వివరించారు. స్థానిక సమస్యల పట్ల శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. మూడో డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను, ఇతర సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పత్తి వెంకటేష్, మోతే కనకయ్య, రాగిడి రాజు, నాసర్, ఉప్పుల రమేష్ పాల్గొన్నారు.







