మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాసవి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ వద్ద వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాల వినియోగం వల్ల నీటి వనరులు తీవ్రంగా కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మట్టి వినాయకులనే ప్రతిష్టించి పూజించాలని పిలుపునిచ్చారు. మట్టి వినాయకుడిని పూజించడం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదని, భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే ఒక సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ముందుకు వచ్చి మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న వాసవి క్లబ్, యూత్ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. అనంతరం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, టీపీసీసీ సభ్యులు కొండా శేఖర్, కార్పొరేటర్లు, క్లబ్ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment