పోర్టబుల్ ఎక్స్-రే ద్వారా క్షయ వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించాలి

  • వర్షాల వేళ కీటక జనిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
  • సీతారాంపల్లి రైతు వేదికలో మెగా వైద్య శిబిరం, 123 మందికి వైద్య పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ

నస్పూర్, ఆర్.కె న్యూస్: క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా పోర్టబుల్ మొబైల్ ఎక్స్-రే యంత్రాల ద్వారా వైద్య శిబిరాలకు వచ్చేవారందరికీ ఎక్స్-రే, తెమడ పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిగల సీతారాంపల్లి రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. శిబిరంలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ జాతీయ అసంక్రమణ వ్యాధుల కార్యక్రమంలో భాగంగా 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి సమయానికి మందులు అందజేయాలని సూచించారు. వ్యాధిగ్రస్తుల వివరాలను నక్షయ్ పోర్టల్‌లో నమోదు చేస్తూ ఎన్జీవోల సహకారంతో పోషకాహార కిట్లను అందజేయాలన్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గన్యా వంటి కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, క్రమం తప్పకుండా డ్రై డే పాటించాలని ఆదేశించారు. వారానికి ఒకసారి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకుంటూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కల్తీ, బయట రోడ్లపై అమ్మే ఆహార పదార్థాలను తినకూడదని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో మాతా శిశు సంరక్షణ, టీకాల పంపిణీతో పాటు 14 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ సేవలు అందించినట్లు తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో మొత్తం 123 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, స్థానిక కార్పొరేటర్ సురిమిళ్ల సౌమ్య, వైద్యాధికారులు డాక్టర్ వెంకటేష్, డాక్టర్ ప్రియాంక, సలోని, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాందేవ్, టీబీ పర్యవేక్షకులు సాయి రెడ్డి, రాజేష్, రషీద్‌తో పాటు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment