వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు కల్పించాలి

అదనపు కలెక్టర్ పి. చంద్రయ్యకు బీఎస్పీ నాయకుల వినతిపత్రం

నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు పౌష్టికాహారం, మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జ్ కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆదేశాల మేరకు గురువారం మంచిర్యాల అదనపు కలెక్టర్ పి. చంద్రయ్యకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ వసతి గృహాల్లో పురుగుల అన్నం, కుళ్లిన కూరగాయలతో కూడిన నాణ్యత లేని భోజనం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల నుంచి సరఫరా అవుతున్న హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ అల్పాహారం నాణ్యత లోపించడంతో విద్యార్థులు తినలేక పారేస్తున్నారని, దీనిపై కలెక్టర్ తక్షణమే తనిఖీలు చేపట్టాలని కోరారు. అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లు, వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో ఫుడ్ కమిటీల ఏర్పాటు, సీసీ కెమెరాల నిఘా, సురక్షిత తాగునీరు, తక్షణ వైద్య సదుపాయంతో పాటు మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఈసీ మెంబర్ ఎండీ మాతిన్ ఖాన్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు దాగం శ్రీనివాస్, మందమర్రి మండల అధ్యక్షుడు ఎండీ రహీం బాబా, నాయకులు చింతల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment