ఎస్ఆర్‌‌పీ-1 గని కార్మికుల సమస్యలు, పనిముట్ల కొరతను వెంటనే పరిష్కరించాలి

టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్‌‌పీ-1 గని కార్మికులు ఎదుర్కొంటున్న పనిముట్లు, రక్షణ పరికరాలు, స్టేషనరీ కొరతను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఎస్ఆర్‌‌పీ-1 గని వద్ద ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించగా, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు. కోల్ కట్టర్లకు 4 అడుగుల డ్రిల్ రాడ్ల సరఫరా సరిగా లేదని, లైన్‌మెన్లకు కీలలు అందకపోవడంతో టబ్బులు పట్టాలు తప్పి ట్రామింగ్ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. అలాగే నాణ్యత లేని సేఫ్టీ షూస్ మూడు నెలలకే పాడైపోతున్నాయని, హ్యాండ్ గ్లౌజులు లేక చేతులకు గాయాలవుతున్నాయని, కార్యాలయ రికార్డులకు స్టేషనరీ కొరత వేధిస్తోందని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ నాయకులు గని మేనేజర్ ఆత్మారావు సహాని దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో సీనియర్ నాయకుడు పెండ్లి రవీందర్‌ను ఏరియా చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ, నియామక పత్రాన్ని మేనేజర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ పెట్టం లక్ష్మణ్, సెంట్రల్ కమిటీ నాయకులు నీలం సదయ్య, కొలిపాక సమ్మయ్య, బ్రాంచ్ సెక్రటరీ రామిడి మహేందర్ రెడ్డి, నాయకులు తిరుపతి రావు, మేడం తిరుపతి, శ్రీకాంత్, సతీష్, కాస రాజు, ప్రవీణ్, మల్లయ్య, వేణుగోపాల్, కొమ్ము రవి, కార్మికులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment