⚪ 32వ డివిజన్లో నూతన గృహాన్ని ప్రారంభించిన మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: అర్హులైన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆత్మగౌరవంతో కూడిన సొంతింటిని కల్పించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. శుక్రవారం 32వ డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు అన్నం అశోక్ – చంద్రకళ దంపతుల నూతన గృహాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యేక చొరవ, కృషితో నియోజకవర్గంలో అర్హులైన పేదలకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో హీరో శ్రీమాన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఆయన సినిమా ప్రచార పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దొ బ్బల శంకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు అందమైన ప్రదేశాల్లో స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు పేర్కొన్నారు. ప్రేమకథతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీమాన్ సరసన సోనాక్షి కథానాయికగా నటించారన్నారు. దుర్గం విజయ్ కుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, పాటలు, కెమెరా, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. తాను భవిష్యత్తులో నిర్మించబోయే చిత్రాల్లోనూ స్థానిక నటీనటులకు ప్రాధాన్యత కల్పిస్తానని స్పష్టం చేశారు. స్థానిక ప్రతిభతో రూపొందిన ఈ చిత్రాన్ని మంచిర్యాల జిల్లా ప్రేక్షకులు ఆదరించి ప్రోత్సహించాలని చిత్ర బృందం కోరింది. ఈ సమావేశంలో చిత్ర బృందం సభ్యులు తోట మహేష్, తోట రమేష్ రాజా, లక్కీ లక్ష్మణ్, అంజి బాబు, ఆర్ఆర్జీ, కాంపెల్లి శ్రీనివాస్, బోనగిరి రాజారెడ్డి, అనిల్, తిరుపతి లింగు, వెంకటేష్, గిరి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.