యథార్థ సంఘటనల ఆధారంగా కురేన్ ఘాట్ చిత్రం

  • చిత్ర నిర్మాత నిర్మాత దొబ్బల శంకర్, హీరో శ్రీమాన్
  • డిసెంబర్ 18న విడుదలకు సన్నాహాలు.. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో చిత్ర పోస్టర్ల ఆవిష్కరణ

నస్పూర్, ఆర్.కె న్యూస్: 2005–2010 మధ్య కాలంలో మంచిర్యాల జిల్లా దేవాపూర్ ప్రాంతంలోని కురేన్ ఘాట్ గిరిజన గూడేల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ‘కురేన్ ఘాట్’ సినిమాను నిర్మించినట్లు చిత్ర నిర్మాత దొబ్బల శంకర్ తెలిపారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో హీరో శ్రీమాన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఆయన సినిమా ప్రచార పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దొ బ్బల శంకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు అందమైన ప్రదేశాల్లో స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు పేర్కొన్నారు. ప్రేమకథతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీమాన్ సరసన సోనాక్షి కథానాయికగా నటించారన్నారు. దుర్గం విజయ్ కుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, పాటలు, కెమెరా, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. తాను భవిష్యత్తులో నిర్మించబోయే చిత్రాల్లోనూ స్థానిక నటీనటులకు ప్రాధాన్యత కల్పిస్తానని స్పష్టం చేశారు. స్థానిక ప్రతిభతో రూపొందిన ఈ చిత్రాన్ని మంచిర్యాల జిల్లా ప్రేక్షకులు ఆదరించి ప్రోత్సహించాలని చిత్ర బృందం కోరింది. ఈ సమావేశంలో చిత్ర బృందం సభ్యులు తోట మహేష్, తోట రమేష్ రాజా, లక్కీ లక్ష్మణ్, అంజి బాబు, ఆర్ఆర్‌జీ, కాంపెల్లి శ్రీనివాస్, బోనగిరి రాజారెడ్డి, అనిల్, తిరుపతి లింగు, వెంకటేష్, గిరి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment