విరాళంగా సేకరించిన 50 వేల రూపాయలు అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3&3ఏ గని కార్మికుడు బైండ్ల మహేష్ కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన మహేష్ భార్యకు సేకరించిన 50 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గురువారం అందజేశారు. ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ మురళి చౌదరి, డిప్యూటీ మేనేజర్ అనిల్ సింగ్, మున్షి గాజుల ప్రభాకర్ బాధిత కుటుంబానికి ఈ నగదును అందజేశారు. గనిలో ట్రామర్గా విధులు నిర్వర్తిస్తున్న మహేష్ అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. తోటి కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. కష్టకాలంలో ఉన్న కుటుంబానికి ఈ సాయం కొంత ఊరటనిస్తుందని ప్రతినిధులు పేర్కొన్నారు. కార్మికుల మధ్య ఉన్న ఐక్యత, మానవత్వాన్ని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గని ఉద్యోగులు ఆడెపు సురేష్, గాజుల కార్తీక్, బేతి మల్లేష్, చక్రి, శ్రీనివాస్, రవి వర్మ, తాటి శ్రీనివాస్, రాజ్ కుమార్, నరేష్ కుమార్, గండు శ్రీకాంత్, రాజయ్య ఇతర కార్మికులు పాల్గొన్నారు.








