జీఎంకు టీబీజీకేఎస్ వినతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల కాలపరిమితి ఈ నెల 8వ తేదీతో ముగిసిన నేపథ్యంలో, సంస్థలోని అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని టీబీజీకేఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పెట్టం లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీలు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్వేష్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్ రెడ్డి, బ్రాంచ్ కార్యదర్శులు గొర్ల సంతోష్, సాదుల భాస్కర్, వెంగల కుమారస్వామి, బుస్స రమేష్, ఏరియా నాయకులు జగదీశ్, తిరుపతి రావు, సముద్రాల అన్వేష్, గడ్డం మల్లన్న, దర్ని దేవేందర్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.







