మట్టి వినాయకుడినే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్‌లో బంకమట్టి విగ్రహాల విశిష్టత పోస్టర్‌ ఆవిష్కరించిన మేయర్

నస్పూర్‌, ఆర్.కె న్యూస్: మన ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భావితరాల భవిష్యత్తు కోసం సైజుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలని మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పిలుపునిచ్చారు. శనివారం నస్పూర్ మండల కేంద్రంలో ‘ప్రకృతి మిత్ర’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన బంకమట్టి వినాయకుడి విశిష్టత పోస్టర్లను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణ చట్టాలు, ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ మట్టి ప్రతిమలనే ప్రతిష్టించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల జలాశయాలు కలుషితమై అనేక జలచరాలు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీసీబీ ఆధ్వర్యంలో రూపొందించిన పర్యావరణ హిత బంకమట్టి వినాయక విగ్రహాన్ని నిర్వాహకులు మేయర్‌కు బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి మిత్ర స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు, తెలంగాణ ప్రభుత్వ వాల్టా అథారిటీ సెనేట్ సభ్యులు గుండెటి యోగేశ్వర్ మాట్లాడుతూ.. పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు అవి నీటిలో కరగకుండా నెలల తరబడి నిల్వ ఉండి ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఫలితంగా జలవనరులు విషతుల్యమై జలచరాలతో పాటు ఆ నీటిని తాగే పశుపక్ష్యాదులు మృత్యువాత పడుతున్నాయన్నారు. పండుగల పరమార్థం ప్రకృతిని రక్షించడమేనని గుర్తుచేశారు. స్థానిక కుమ్మరి కళాకారులు తయారుచేసిన మట్టి విగ్రహాలను కొనుగోలు చేసి వారి జీవనోపాధికి తోడ్పడటంతో పాటు పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి మిత్ర ముఖ్య బాధ్యులు మోతే శరత్, గుండెటి సుధీర్, క్యాతం రాజేష్, బోయినపల్లి రాజశేఖర్, ప్రకృతి మిత్ర సభ్యులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment