అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ గాంధీనగర్‌కు చెందిన మహ్మద్ కలీంకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 4,00,000 విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది. ఈ ఎల్‌ఓసీ పత్రాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకోవడంలో ముందుంటామని భరోసా ఇచ్చారు. తమ కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి-లింగయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.







