ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పురోహితులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య గణపతికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దావా స్వాతి రమేష్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్, సీనియర్ నాయకులు ముచ్చర్ల మల్లయ్య, చిలుముల శంకర్, ఇతర ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment