తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ నియామకం

ప్రకటించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

మంచిర్యాల , ఆర్.కె న్యూస్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ప్రముఖ విద్యావంతుడు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం వివిధ జిల్లాల అధ్యక్షుల జాబితాను విడుదల చేస్తూ మంచిర్యాల జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించినందుకు పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు చంద్రమోహన్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కవితక్క ప్రతిపాదించిన ‘పాంచజన్య’ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన, సామాజిక న్యాయ సాధనే పరమావధిగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని, జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment