రోగుల భద్రత, నాణ్యమైన చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలి

జిల్లా కేంద్రం, నస్పూర్ పీహెచ్‌సీలో ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం.. సిబ్బందితో ప్రతిజ్ఞ

నస్పూర్, ఆర్. కె న్యూస్: ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి సురక్షితమైన సంరక్షణతో పాటు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఆరోగ్య శాఖ లక్ష్యం అని ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, నస్పూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంతో పాటు నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి, వైద్య సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీలు, ఉప కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, యూపీహెచ్‌సీలలో రోగి భద్రతా వారోత్సవాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా అసంక్రమిత వ్యాధులను (బీపీ, షుగర్ తదితర) ప్రాథమిక దశలోనే గుర్తించి, క్రమం తప్పకుండా మందులు వాడేలా రోగులకు స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల ఆశా, పారామెడికల్ సిబ్బంది, వైద్యులు సత్వరమే స్పందించి సరైన వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, కూర్చునే వసతి, గర్భిణులు, బాలింతలకు అవసరమైన ప్రత్యేక సదుపాయాలు, స్ట్రెచర్లు, వీల్‌చైర్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని సూచించారు. రోగులు ఆసుపత్రికి వచ్చేటప్పుడు సహాయకులను తోడుగా తెచ్చుకోవాలని, వైద్యుల సూచనల మేరకే మందులను వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రషీద్, డీపీవో ప్రశాంతి, సీహెచ్‌వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, పుట్ట సత్తయ్య, అధికారులు రాజ్‌కుమార్, నీలిమ పాల్గొన్నారు. అలాగే నస్పూర్ పీహెచ్‌సీలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ అధికారి కవిత, ఆరోగ్య కార్యకర్తలు వెంకట్, సునీల్, ఆశా కార్యకర్తలు, రోగులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment