సోన్, ఆర్.కె న్యూస్: మండలంలోని న్యూ వెల్మల్ గ్రామంలో గల శ్రీ సాయి హై స్కూల్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఏక్తా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ జెండాలతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ ఐక్యత, సమగ్రత సందేశాన్ని చాటారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.అనంతరం పాఠశాలలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఏక్తా దివస్ ప్రాముఖ్యతపై ప్రసంగాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర, దేశ సమైక్యత, జాతీయ సమగ్రత, ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు ఐక్యత అంటే ఏమిటి, భిన్నత్వంలో ఏకత్వం ఎందుకు అవసరం, దేశ అభివృద్ధికి ఐకమత్యం ఎలా దోహదపడుతుంది అనే విషయాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నరసయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
12







