సీసీసీ కార్నర్ చౌరస్తాలో సులభ్ కాంప్లెక్స్ పనులను పరిశీలించిన మేయర్ ధర్ని మధుకర్

నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ సీసీసీ కార్నర్ చౌరస్తా వద్ద నిర్మిస్తున్న సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పురోగతిని మేయర్ ధర్ని మధుకర్ గురువారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రయాణికులు, స్థానిక ప్రజలు మరియు వ్యాపారుల సౌకర్యార్థం ఈ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ… నిత్యం రద్దీగా ఉండే సీసీసీ కార్నర్ కూడలి వద్ద మరుగుదొడ్ల సదుపాయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారస్తులు, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న ఈ సులభ్ కాంప్లెక్స్ పనులను వేగవంతం చేయాలని, నాణ్యతతో కూడిన పనులు చేపట్టి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక వర్తక వాణిజ్య సంఘం నాయకులు, వ్యాపారస్తులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment