ఎస్ఆర్‌పీ-3 గని ఏఐటీయూసీ మహిళా పిట్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అనుబంధ ఎస్ఆర్‌పీ 3 గని మహిళా పిట్ కమిటీ జనరల్ బాడీ సమావేశం శనివారం శ్రీరాంపూర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్ఆర్‌పీ-3 గని మహిళా పిట్ కార్యదర్శిగా నాంపెల్లి స్రవంతి, అసిస్టెంట్ పిట్ కార్యదర్శిగా కొంకట సువర్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అయిత అనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… గనిలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగినందున ప్రస్తుతం ఉన్న విశ్రాంతి గది సరిపోవడం లేదని, తక్షణమే గదిని విస్తరించి అన్ని వసతులు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అన్ని గనులలో కమిటీలను ఏర్పాటు చేసి మహిళా కార్మికుల హక్కుల సాధనకు పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, పిట్ సహాయ కార్యదర్శి అంబాల రవి, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment