నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి కుటుంబానికి ఒక భరోసా – ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్లతో కలిసి మేయర్ ధర్ని మధుకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, స్థానిక ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్, అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ… ఆపద సమయంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉన్నత ఆశయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని అర్హులైన కుటుంబాలన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ రాజు, కార్పొరేటర్లు కొండ్ర రాజేశ్వరి-లింగయ్య, రాచకొండ గోపాల్ రావు, ఎండీ ఖలీద్, తాళ్ల సంపత్ రెడ్డి, అగ్గు సాగర్, మున్సిపల్ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
10







