శ్రీరాంపూర్ ఏరియాకు ఐకాన్‌గా ఎకో పార్కు నిర్మాణం

శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, ఆర్.కె న్యూస్: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణే ధ్యేయంగా సింగరేణి సంస్థ చేపడుతున్న హరిత చర్యల్లో భాగంగా నిర్మిస్తున్న నూతన ఎకో పార్కు శ్రీరాంపూర్ ఏరియాకే ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఎస్సార్పీ ఓపెన్‌కాస్ట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న ఎకో పార్కు నిర్మాణ పనుల పురోగతిని ఆయన సంబంధిత అధికారులతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం మునిగంటి శ్రీనివాస్ పార్కులోని వాకింగ్ ట్రాక్, వాటర్ ఫౌంటెన్లు, ఆకర్షణీయమైన లైటింగ్ వ్యవస్థ, లేక్, పచ్చదనం పెంపొందించే పనుల తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గత నెలతో పోలిస్తే నిర్మాణ పనుల్లో మంచి పురోగతి కనిపించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలు, పెద్దలు, కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదంగా సేదతీరేలా అన్ని హంగులతో ఈ పార్కును తీర్చిదిద్దాలని ఆదేశించారు. మిగిలిన పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, అతి త్వరలోనే ఈ ఎకో పార్కును శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్పీ ఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిహెచ్. వెంకటేశ్వర్లు, డీజీఎం (ఫారెస్ట్) హరినారాయణ, సివిల్ హెచ్‌ఓడీ ఎ. రవికుమార్, శ్రీరాంపూర్ ఓసీ మేనేజర్ ఐ. శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఇంజనీర్ నాగరాజు, సర్వేయర్ సంపత్ రెడ్డి, డీవై ఎస్ఈ గుండెరావు, సివిల్, ఫారెస్ట్ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment