- టీజీఎఫ్ డీసీ డివిజనల్ మేనేజర్ గణేష్
- కాగజ్ నగర్ లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీ
కాగజ్ నగర్, ఆర్.కె న్యూస్: పర్యావరణ పరిరక్షణ అందరి ద్యేయం కావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పాటుపడాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ జి. గణేష్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా కాగజ్ నగర్ లో టీజీ ఎఫ్ డీసీ
ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా డివిజనల్ కార్యాలయం నుంచి కాగజ్ నగర్ పట్టణ వీధుల్లో సిబ్బందితో కలిసి పర్యావరణం పై ప్రజలకు అవగాహన కలిగే విధంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్లాంటేషన్ మేనేజర్ లు లక్ష్మణ్ (కాగజ్ నగర్ రేంజ్ ), గోగు సురేష్ (మంచిర్యాల రేంజ్) జలపతి (బెల్లంపల్లి రేంజ్) లతో కలిసి డివిజన్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, తద్వారా కాలుష్యాన్ని నియత్రించ వచ్చన్నారు. డివిజనల్ మేనేజర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ లు లక్ష్మణ్, గోగు సురేష్, జలపతి, జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, ఫీల్డ్ సూపర్ వైసర్ లు, వాచర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.







