మేయర్ సహకారంతో పారిశుద్ధ్య పనులు చేపట్టిన కార్పొరేటర్ ఎల్పుల రవీందర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడో డివిజన్ ఆర్‌కే-8 కాలనీలో మృతి చెందిన ఆవును మున్సిపల్ సిబ్బంది మంగళవారం పూడ్చిపెట్టారు. హోలీ పండుగను పక్కన పెట్టి మేయర్ ధరణి మధుకర్ సహకారంతో డివిజన్ కార్పొరేటర్ ఎల్పుల రవీందర్ ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. కాలనీలో గోవు చనిపోయిన విషయాన్ని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. పండుగ సెలవు దినం అయినప్పటికీ పారిశుద్ధ్య సిబ్బందిని సమాయత్తం చేసి మృతదేహాన్ని తొలగించేలా చర్యలు తీసుకున్నారు. కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా గోవును సురక్షిత ప్రాంతానికి తరలించి పూడ్చిపెట్టించారు. విధి నిర్వహణలో నిబద్ధత చాటిన శానిటేషన్ సిబ్బందిని ఈ సందర్భంగా కార్పొరేటర్ అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో సెలవులను సైతం లెక్కచేయకుండా సహకరించిన మున్సిపల్ యంత్రాంగానికి రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.







