నస్పూర్, ఆర్.కె న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాచకొండ వెంకటేశ్వరరావు (బుజ్జన్న) ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న విషయం తెలుసుకున్న మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్ రావు మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బుజ్జన్న ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు రాచకొండ గోపాల్ రావు, ఎంబడి కుమారస్వామి, ఖలీద్, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
26







