వేమనపల్లి, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని కేతనపల్లి గ్రామానికి చెందిన మాండ్రా రమేష్ అలియాస్ బికారు (35) వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేష్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాల్లో గాలించారు. శనివారం వ్యవసాయ బావిలో రమేష్ మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న నీల్వాయి ఎస్సై నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కొంతకాలంగా మద్యానికి బానిసైన రమేష్ మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








