వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు అనేక ప్రయోజనాలు

  • ప్రభుత్వ రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
  • జిల్లా వ్యవసాయ అధికారి ఆసం రవి

సోన్, ఆర్.కె న్యూస్: వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు సమయం, శ్రమను కూడా గణనీయంగా ఆదా చేసుకోవచ్చని నిర్మల్ జిల్లా వ్యవసాయ అధికారి ఆసం రవి తెలిపారు. సోన్ మండలంలోని మాదాపూర్ రైతువేదికలో వ్యవసాయ శాఖ, వివిధ బ్యాంకుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ అవగాహన కార్యక్రమానికి డి ఏ ఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్, పీఎం ఎఫ్ఎంఈ, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి పలు ప్రతిష్టాత్మక పథకాల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన యంత్ర పరికరాలను రాయితీపై అందిస్తున్నాయని, ఆ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంతేకాకుండా యువ రైతులు చిన్న, మధ్య తరహా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయాలు కల్పించడంతో పాటు వడ్డీ రాయితీలు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ అధికారుల బృందం రైతులకు ఆయా బ్యాంకులు అందిస్తున్న వివిధ వ్యవసాయ రుణాలు, పథకాలు, ఆర్థిక సహాయంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సౌమ్య మల్లేష్, ఏఈఓ రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి జయలక్ష్మి, బ్యాంకు అధికారులు పుష్పలత, కిషోర్, అవినాష్, పవన్, భరత్‌ వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment