నస్పూర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రూరల్ సీఐ, ఎన్‌హెచ్ఏఐ ఇంజినీర్

రోడ్డు భద్రత, ఇంజినీరింగ్ లోపాలపై క్షేత్రస్థాయి సమీక్ష

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ గేట్ వద్ద జాతీయ రహదారి-63పై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎన్‌హెచ్-63 సైట్ ఇంజినీర్ వినోద్ కుమార్, సీసీసీ నస్పూర్ ఎస్సై ఎండీ తహిసీనుద్దీన్‌లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత నెల 28న ఐదుగురు మహిళల ప్రాణాలు బలిగొన్న ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఘటన జరిగిన ప్రాంతంలో రోడ్డు నిర్మాణ సంబంధిత ఇంజినీరింగ్ లోపాలు, డివైడర్ల అమరిక, రహదారి పరిస్థితులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన ముందస్తు రక్షణ చర్యలు, రోడ్డు భద్రతా నిబంధనల అమలు, ప్రమాదకర మలుపులు, డివైడర్ల ఖాళీల నియంత్రణపై ఎన్‌హెచ్ఏఐ అధికారులతో చర్చించారు. త్వరలోనే అవసరమైన మరమ్మతులు, నిర్మాణాత్మక మార్పులు చేపట్టి రహదారిని ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment