బొగ్గు ఉత్పత్తిలో శ్రీరాంపూర్ ఏరియా ముందంజ

సెప్టెంబర్‌లో 99 శాతం లక్ష్య సాధన.. వార్షిక లక్ష్యాన్ని అధిగమిస్తాం
శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పరంగా సెప్టెంబర్ మాసంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాలోని మూడు భూగర్భ గనులు, ఒక ఓపెన్ కాస్ట్ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి వంద శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తిని నమోదు చేశాయని హర్షం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీరాంపూర్ ఏరియా మొత్తం ఉత్పత్తి లక్ష్యం 4,10,000 టన్నులు కాగా, 4,07,215 టన్నుల బొగ్గు వెలికితీసి 99 శాతం రికార్డు సాధించినట్లు తెలిపారు. భూగర్భ గనులలో ఎస్సార్పీ-1 గని 106 శాతం, ఆర్.కె-7 గని 101 శాతం, ఆర్.కె న్యూటెక్ గని 107 శాతం ఉత్పత్తి సాధించాయని పేర్కొన్నారు. మొత్తం భూగర్భ గనుల లక్ష్యం 1,20,000 టన్నులకు గాను 1,14,470 టన్నులతో 95 శాతం ఉత్పత్తి నమోదైందన్నారు. అలాగే ఉపరితల గనుల్లో ఎస్సార్పీ ఓసీపీ 114 శాతం ఉత్పత్తిని కనబరచగా, ఐకే ఓసీలో కొత్త కాంట్రాక్ట్ ప్రారంభమై 44 శాతం ఉత్పత్తి నమోదైందని తెలిపారు. మొత్తంగా ఓసీపీలలో 2,90,000 టన్నుల లక్ష్యానికి గాను 2,92,745 టన్నులతో 101 శాతం సాధించడం అభినందనీయమన్నారు. మిగిలిన ఆరు నెలల కాలంలో భూగర్భ, ఉపరితల గనుల్లో రక్షణతో కూడిన ఉత్పత్తిని మరింత పెంచి, సంస్థ వార్షిక నిర్దేశిత లక్ష్యాన్ని నూటికి నూరు శాతం అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని జీఎం వివరించారు. మెడికల్ ఇన్‌వాలిడేషన్ ద్వారా ఇప్పటివరకు 3,868 మంది కార్మికుల వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. మరో 320 మంది ఉద్యోగులకు ఎల్‌ఎస్‌పీ, 14 మందికి ఎంఎంసీ చెల్లింపులు పూర్తి చేశామన్నారు. ఉద్యోగ విరమణ పొందిన 9,795 మంది విశ్రాంత ఉద్యోగులకు సీపీఆర్‌ఎంఎస్ పథకం కింద మెడికల్ కార్డులను అందజేసినట్లు జీఎం వెల్లడించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment