రేపు గనులపై వినతిపత్రాలు.. లాభాల వాటాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున, కోల్ ఇండియా తరహాలోనే జేబీసీసీఐ ప్రాతినిధ్య జాతీయ సంఘాలన్నింటికీ సమాన హోదా, ప్రాతినిధ్యం కల్పించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) డిమాండ్ చేసింది. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాతాడి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య పాల్గొని మాట్లాడారు. సంస్థలో 2023 డిసెంబర్ 27న 7వ దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు జరగ్గా, గడువు ముగిసిందని తెలిపారు. గత గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికులకిచ్చిన హామీలను నెరవేర్చడంలో, 12వ వేతన ఒప్పంద ప్రధానాంశాలు సహా పరిశ్రమ పరిరక్షణ, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. గుర్తింపు సంఘం గడువు ముగిసిన తర్వాత కూడా ఏదైనా ఒక సంఘానికే ప్రాధాన్యత ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్నారు. తదుపరి గుర్తింపు ఎన్నికలు నిర్వహించేంతవరకు అన్ని జేబీసీసీఐ ప్రాతినిధ్య సంఘాలను చర్చలు, సమావేశాలకు సమానంగా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం (సెప్టెంబర్ 14న) అన్ని గనుల మేనేజర్లు, డిపార్ట్మెంట్ అధికారులు, జీఎం కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను యాజమాన్యం వెంటనే ప్రకటించి, శ్వేతపత్రం విడుదల చేయాలని, కార్మికుల కష్టార్జితమైన లాభాల వాటాను చెల్లించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏరియా కార్యదర్శి రాజారాం కిరణ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు జెల్ల తిరుపతి, అప్పాల బీరయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలు మిట్ట మధుకర్, కనవేని సాగర్, ఆఫీస్ సెక్రటరీ బుర్ర అరుణ్ కుమార్ గౌడ్, పిట్ సెక్రటరీలు కొమ్మ బాపు, బొంపల్లి రమేష్, గొల్ల సురేష్, కుంట రాజు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు చల్ల శ్రీనివాస్, కాళహస్తి రాజరాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.





సిద్ధి వినాయక గణేష్ మండలి ఆవరణలో ఆదివారం ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో 200 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యోగేశ్వర్ మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీటిలోని ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాలు, ఆ నీరు తాగే పక్షులు, మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రసాయన రంగులతో విగ్రహాలు తయారు చేసే కార్మికులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. నవరాత్రి పూజల్లో మహిళలు ప్లాస్టిక్ బుట్టల స్థానంలో వెదురు, స్టీలు బుట్టలను, ప్రసాదాల వితరణకు ఆకు డొప్పలను వినియోగించాలని సూచించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. సిద్ధి వినాయక గణేష్ మండలి వేడుకల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి, పర్యావరణ హితంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టిన గుండెటి యోగేశ్వర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నెక్స్ ఐరా ఐటీ కంపెనీ ఎండీ మోతే శరత్ చంద్ర మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇలాంటి మంచి కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ ముఖ్య నాయకులు పొన్న మల్లయ్య, శ్రీపతి బాబురావు, బి. రామ్మోహన్, కే. నాగేశ్వరరావు, ఎస్. మొండయ్య, ఎన్. సత్యనారాయణ, టి. తిరుపతి, జి. వెంకటేశం, ప్రకృతి మిత్ర సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
పరిధిలోని 14వ డివిజన్ పాత మంచిర్యాలలోని పురాతన శ్రీ రామాలయం–శివాలయం–భక్త ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో సుమారు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల మౌలిక వసతుల కల్పన దిశగా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. అనంతరం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే భక్తులకు పంపిణీ చేశారు. ప్రకృతిని, జలాశయాలను కాపాడేందుకు మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు, స్థానిక కార్పొరేటర్ తూముల నరేష్, డివిజన్ నాయకులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, పార్టీ జిల్లా, డివిజన్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, స్థానికులు పాల్గొన్నారు.