కౌమార దశలో ఆరోగ్య అవగాహనతోనే బంగారు భవిష్యత్తు

రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కరపత్రాల విడుదల: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్

నస్పూర్, ఆర్.కె న్యూస్: కౌమార దశలో బాలబాలికలకు శారీరక, మానసిక మార్పులపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడంతో పాటు నమ్మకం, గోప్యతతో కూడిన సలహాలు అందించినప్పుడే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యం” అని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా 10 నుంచి 19 ఏళ్ల లోపు బాలబాలికలకు ఉద్దేశించిన ప్రచార కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు, పాఠశాలల్లో పీర్ గ్రూప్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కౌమార బాలబాలికల్లో రక్తహీనత, పోషకాహార లోపం నివారణకు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు, రుతుస్రావ పరిశుభ్రత, మానసిక ఒత్తిడి, కోపం వంటి సమస్యల పరిష్కారానికి క్లినిక్‌ల ద్వారా కౌన్సిలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. మద్యం, ధూమపానం, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా విద్యార్థులకు మార్గదర్శనం చేయాలన్నారు. బాలబాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే గట్టిగా ప్రతిఘటించాలని, నమ్మకమైన పెద్దలకు చెప్పడంతో పాటు టోల్‌ఫ్రీ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని డీఎంహెచ్‌వో పిలుపునిచ్చారు. 18 ఏళ్ల లోపు ఆడపిల్లలకు, 21 ఏళ్ల లోపు మగపిల్లలకు పెళ్లిళ్లు చేయడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా ఉంటుందని హెచ్చరించారు. బాల్య వివాహాల వల్ల అకాల గర్భం, ప్రసూతి మరణాలు, శిశు మరణాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఈ చైతన్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని మాస్ మీడియా విభాగాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్‌వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, పుట్టా సత్తయ్య, శ్రీనివాస్, పద్మ, సుమన్, లక్ష్మణస్వామి పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment