సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండలంలోని న్యూ బొప్పారం గ్రామానికి చెందిన పెద్దోళ్ల పెద్ద గంగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా బుధవారం మాజీ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట అల్లోల మురళీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకయ్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
KYATHAM RAJESH
సోన్,ఆర్.కె న్యూస్: సోన్ మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని బాల సదనంలో మానసిక వికలాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోన్ మండల అధ్యక్షుడు అంకం సురేష్, కోశాధికారి పడిగెల నర్సయ్య, ఉపాధ్యక్షులు ఆకుల గంగాధర్, సభ్యులు అఖిల్, శేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సోన్, ఆర్.కె న్యూస్: చేపల మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచి చేపలు విక్రయించాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ అన్నారు. సోన్ గ్రామ పంచాయతీలో మత్స్యకారుల కొరకు చేపల విక్రయానికి నిర్మించిన వర్క్ షెడ్ నిర్మాణంను డిప్యూటీ కమిషనర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్క్ షెడ్ లోపల పరిశీలించి పరిశుభ్ర వాతావరణంలో చేపల మార్కెట్‌ను నిర్వహించాలని సూచించారు. నిర్మాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.షెడ్డు నిర్మాణం గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి ని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ చేపల మార్కెట్ ను సోన్ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా మండలంలోని చుట్టుపక్కల గ్రామాల వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో రైతులకు ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ యాప్, ఎరువుల బుకింగ్ విధానంపై అవగాహన ఏవో వినోద్ కుమార్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి. వినోద్ కుమార్ రైతులకు యాప్ వినియోగం, ఎరువుల బుకింగ్ విధానం, బుకింగ్ అనంతరం ఎరువులు పొందే ప్రక్రియను వివరించారు. కొత్త యాప్‌లో యూరియాతో పాటు డిఎపి, కాంప్లెక్స్ ఎరువులకు కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకుని ఉండాలని, దీనిలో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్‌తో కానీ, ఫార్మర్ ఐడితో కానీ, లాగిన్ కావొచ్చని తెలిపారు. దీనిలో సర్వే నెంబర్ వారీగా పంటల వివరాలు సర్వే నెంబర్ వారీగా ఎరువులను బుకింగ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న అనంతరం సంబంధిత డీలర్ వద్ద బుకింగ్ వివరాలు క్యూఆర్ కోడ్ చూపించి ఎరువులు పొందవచ్చని తెలిపారు. రైతులు ఎరువుల కోసం ముందస్తు బుకింగ్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఉమా మహేశ్వరి, రైతులు తిరుపతి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
డిసిఓఆర్ ప్రశాంతి
సోన్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2026- 27 విద్యా సంవత్సరానికి గాను నడపబడుతున్న నీట్ లాంగ్ టర్మ్ శిక్షణ కొరకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ జిల్లా సమన్వయకర్త ఆర్. ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని చిలుకూరు సీఓఈ నందు బాలురకు, మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ సీఓఈ నందు బాలికలకు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకొనుటకు అభ్యర్థులు ఏదైనా కళాశాలలో 2025-26లో ఇంటర్మీడియట్ బైపీసీ చదివి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు tgwreis.telangana.gov.in అనే వెబ్సైట్ సందర్శిస్తే నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు ఫారం పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 22 అని, దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదని ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని డీసీవో కార్యాలయం TGSWRS JC (బాలికల) లెఫ్ట్ పోచంపాడ్ లో నిర్దిష్ట గడువులోపు దరఖాస్తు ఫారాలను సమర్పించాలని సూచించారు.
సోన్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
సోన్, ఆర్.కె న్యూస్: మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించాలని సోన్ ఎంపీడీవో రామకృష్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం సోన్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రజావాణిలో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణ పనులకు సంబంధించి మొత్తం మూడు దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖల ద్వారా పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్ లతో పాటు మండలంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ 6వ డివిజన్లో ఉచిత వైద్య శిబిరం
- నిర్మల పాలిక్లినిక్, శ్రీ వాసుదేవాయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: ముందస్తు పరీక్షలు, క్రమం తప్పని ఆరోగ్య పరిరక్షణ ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే నివారించవచ్చని వైద్య నిపుణులు డాక్టర్ జి. శ్రీకాంత్, డాక్టర్ కుసుమ నిర్మల పేర్కొన్నారు. శ్రీ వాసుదేవాయ హెల్త్ కేర్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్మల పాలిక్లినిక్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీలోని 6వ డివిజన్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక 6వ డివిజన్ కార్పొరేటర్ వనపర్తి కేతా రాజేష్, దాత గుత్తికొండ ప్రశాంత్ ప్రత్యేక సహకారం అందించారు. శిబిరంలో స్థానిక ప్రజలకు జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ వైద్య సేవలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. నిపుణులైన వైద్యులు డాక్టర్ జి. శ్రీకాంత్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కుసుమ నిర్మల రోగులను స్వయంగా పరీక్షించి కుటుంబ ఆరోగ్య సలహాలు అందించారు. పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల స్పృహ కలిగి ఉండాలని సూచించారు. ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన స్థానికులు వైద్య పరీక్షలు చేయించుకుని సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ తోటపల్లి రాజేశ్వరి, నాయకులు ప్రణయ్, ముక్కెర శ్రీనివాస్, బొజ్జ భూమన్న, శ్రీనివాస్, సంపత్, సాగర్, శ్యామ్, కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు.

- మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరుతుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్లో లబ్ధిదారులు శీలం గట్టక్క, గట్టయ్య దంపతులు పూర్తి చేసుకున్న నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఇంటిని ప్రారంభించి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాచకొండ గోపాల్ రావు, హౌసింగ్ బోర్డు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు నగర్లో సమస్యల పరిశీలన, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం సాధ్యమవుతుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ అల్లూరి సీతారామరాజు నగర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పారిశుద్ధ్య పనులు, రోడ్ల పరిస్థితి, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై స్థానికులతో చర్చించారు. డివిజన్లో ఎలాంటి సమస్యలున్నా వెంటనే తన దృష్టికి గానీ, మున్సిపల్ అధికారుల దృష్టికి గానీ తీసుకురావాలని మేయర్ సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డివిజన్ వ్యాప్తంగా ముమ్మరంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించడంతో పాటు డ్రైనేజీలలో పూడికతీత పనులను చేయించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు డివిజన్ ఆఫీసర్ రాజమణి, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపతి తిరుపతి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆగస్టు 15న జరుపుకోనున్న జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నస్పూర్ మండలంలో ముందస్తు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సింగపూర్ మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి, మాజీ ఎంపీటీసీ లాట్కూరి రాజలింగు ఆధ్వర్యంలో ఆర్.కే-6 అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి హాజరై చిన్నారులకు గొడుగులను అందజేశారు. ప్రజాసేవలో ముందుండే నాయకుల జన్మదినాన్ని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు ఉపయోగపడేలా గొడుగులు అందించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, ట్రస్మా ఉపాధ్యక్షుడు రేగేడ్ల ఉపేందర్, భవాని శ్రీను, నాయకులు సందినేని సతీష్ యాదవ్, పూదరి కుమార్, గోపతి తిరుపతి, రాజేశ్వర్ రెడ్డి, నరేష్, రమేష్, దాసరి మధు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.



