మంచిర్యాల బీజేపీ అసెంబ్లీ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ సభలో మహిళా బిల్లు ప్రాధాన్యత, ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మహిళలు తమ హక్కుల కోసం చట్ట సభల్లో గళం విప్పేందుకు ఈ బిల్లు గొప్ప అవకాశం కల్పిస్తుందని రఘునాథ్ వెరబెల్లి చెప్పారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ ఉనికి కోల్పోతామనే భయంతోనే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. దేశంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఉత్తర, దక్షిణ భారతదేశం పేరుతో ప్రజల మధ్య అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. విపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బీజేపీ కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ అంశాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని సూచించారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన వెంటనే అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని కార్యకర్తలను కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా క్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం అశోక్, గాజుల ముఖేష్ గౌడ్, తోట మల్లికార్జున్, ఎనగందుల కృష్ణ మూర్తి, కమలాకర్ రావు, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, అమిరిశెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, కుర్రె చక్రి, సత్రం రమేష్, స్వామి రెడ్డి, హరి గోపాల్, హేమంత్ రెడ్డి, వైద్య శ్రీధర్, జయరామ రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.





ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు నాయకులు మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను కలిపి రూపొందించిన ఈ కోడ్లు కార్మికులకు రక్షణ కల్పించేందుకు కాకుండా యాజమాన్యాలకు అధికారం పెంచేందుకు ఉపయోగపడుతున్నాయని విమర్శించారు. ఉద్యోగ భద్రతను దెబ్బతీసేలా 300 మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో కూడా సులభంగా ఉద్యోగాల నుంచి తొలగించే నిబంధనలు తీసుకురావడం దారుణమని మండిపడ్డారు. ఇక కార్మికుల నిరసన హక్కును పరిమితం చేయడం, కాంట్రాక్ట్ మరియు గిగ్ వర్కర్లను నిర్లక్ష్యం చేయడం, కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఆరోగ్య పరిరక్షణ వంటి కీలక అంశాలను పక్కన పెట్టడం ఈ చట్టాల అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాయని పేర్కొన్నారు. ఇవి సంక్షేమ పథకాలు కావు… కార్మికులపై భారంగా మోపిన దోపిడీ విధానాలు అని తీవ్రంగా విమర్శించారు. 2026 ఫిబ్రవరి 13న దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెను గుర్తు చేస్తూ, కార్మికుల వ్యతిరేకతను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జాతీయ కార్మిక సంఘాలు కూడా ఈ విషయంలో మౌనం వహించడం కార్మిక వర్గానికి ద్రోహమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎం. పోచమల్లు, అంబాల మహేందర్, గోగర్ల శంకర్, జి. అంజయ్య, ఎన్నం శంకర్ తదితరులు పాల్గొని, కార్మికులు అప్రమత్తంగా ఉండి తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య ఈ కార్యక్రమానికి హాజరై డివిజన్ వ్యాప్తంగా చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించి తగిన సూచనలు చేశారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి డివిజన్ అంతటా పర్యటించిన మేయర్ బృందం స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిసరాల పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రణాళికాబద్ధమైన ఈ పారిశుధ్య పనుల ద్వారా నగరాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మేయర్ వివరించారు. ప్రజల సహకారంతోనే పట్టణ సుందరీకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ అమృత రాజ్ కుమార్, 27వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య, వార్డు ఆఫీసర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
జీఎం కార్యాలయం వరకు పోలీసులు, కార్మికులు, స్థానిక ప్రజలతో కలిసి ఈ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జైపూర్ ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది విధిగా హెల్మెట్ ధరించాలని, నో హెల్మెట్ – నో ఎంట్రీ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులతో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదకరమని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, సింగరేణి కార్మికులు, ప్రజల భద్రతను పరిరక్షించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ ఆకుల అశోక్, జైపూర్ సిఐ నవీన్ కుమార్, ఎస్సైలు రాజశేఖర్, మేకల సంతోష్, లక్ష్మీ ప్రసన్న, పోలీస్ సిబ్బంది, సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.